AP News: 2025-26 కేంద్ర బడ్జెట్.. మధ్య తరగతి ఉద్యోగులకు భారీ ఊరట!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి ఉద్యోగులకు ఊరటనిచ్చే విషయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప తెలిపారు.

దిశ ప్రతినిధి,నంద్యాల: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి ఉద్యోగులకు ఊరటనిచ్చే విషయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప తెలిపారు. స్థానిక జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2025లో వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26నకు ఆదాయపు పన్ను మినహాయింపు రూ.12 లక్షల వరకు పెంచడం మధ్య తరగతి ఉద్యోగులకు భారీ ఊరట ఇచ్చే విషయం అని తెలిపారు. అదేవిధంగా శ్లాబ్ రేట్లలో మార్పులు చేయడం వలన మధ్య తరగతి ఉద్యోగులకు పన్ను మొత్తం కూడా తగ్గుతుంది అని అంతే కాకుండా స్టాండర్డ్ డిడక్షన్ తో కలుపుకొని రు.
12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది అని తెలియజేశారు. రూ.12 లక్షలు ఆదాయం ఉన్న వారికి రూ. 80 వేల రూపాయల వరకు ఆదా అవుతుంది అని, గత ధశాబ్ద కాలంలో మధ్య తరగతి ఉద్యోగులకు ఆదాయ పన్ను మినహాయింపు లో ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది అని, పౌర సమాజంలో ఆదాయంపై పన్ను కడుతున్న అత్యధిక వర్గం ఉద్యోగులు మాత్రమే అని, ఈ బడ్జెట్ మధ్య తరగతి ఉద్యోగులకు భారీ ఊరట గానే పరిగణించాలని, ఉద్యోగులకు వారి కుటుంబాల ఆర్ధిక స్థితిగతుల పై కూడా ప్రభావం చూపే బడ్జెట్ అని, దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఈ బడ్జెట్ తోడ్పాటు అందిస్తుంది తెలిపారు.
వచ్చే వారం ఆదాయ పన్ను బిల్లు ను ప్రవేశ పెట్టే బిల్లులో కూడా ఉద్యోగుల ప్రయోజనాలు చేకూరేలా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆదే విధంగా మద్య తరగతి ఉద్యోగులకు ఈ భారీ ఊరటనిచ్చిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి మరియు వారి కేబినెట్ మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుపాలయ్యా, జిల్లా సహా అధ్యక్షులు శ్రీహరి, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు ఫకృద్దీన్, సిటీ అధ్యక్షులు సత్యం, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.