కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న అధికారుల నిర్లక్ష్యం.. తుప్పు పట్టిన కిటీకిలతో దర్శనమిస్తున్న హౌసింగ్ కార్యాలయం

ఏ ప్రభుత్వం వచ్చిన ముందు పేదవాడి సొంతింటి కళ పై మాట్లాడుతారు.

Update: 2025-01-31 15:22 GMT
కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న అధికారుల నిర్లక్ష్యం.. తుప్పు పట్టిన కిటీకిలతో దర్శనమిస్తున్న హౌసింగ్ కార్యాలయం
  • whatsapp icon

దిశ నంద్యాల, ప్రతినిధి: ఏ ప్రభుత్వం వచ్చిన ముందు పేదవాడి సొంతింటి కళ పై మాట్లాడుతారు. పేదవారిని గుర్తించి అర్హతలు ఉన్నవారికి స్థలాలు కేటాయిస్తారు. స్థలాలు వచ్చిన లబ్ధిదారులు తమ వద్ద ఉన్న డబ్బుతో పాటు ప్రభుత్వం ఇల్లు కట్టుకునే వారికి రుణాలు మంజూరు చేస్తుంది. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వ నిబంధనలు మేరకు కొంత వీసాలు వెసులుబాటు కల్పిస్తుంది. ప్రభుత్వం పేదలకు సిమెంట్, స్టీల్, కిటికీలు, ద్వార బంధాలు, మరుగుదొడ్ల షీట్స్ అందిస్తారు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పలు కిటికీలు, మరుగుదొడ్డి షీట్స్ కొన్ని తుప్పు పట్టి పోతున్నాయి. మరిన్ని విరిగిపోతున్నాయి.

లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వం ఇచ్చే వాటిని ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాయి. కార్యాలయంలో సమాచారం కోసం వెళ్లిన వారికి అక్కడ సమాధానం చెప్పే అధికారులు కనిపించరు. ప్రశ్నిస్తే ఫీల్డ్ లో ఉన్నారని సమాధానం ఇస్తున్నారు. హౌసింగ్ పరిధిలో ఎన్ని మంజూరు అయ్యాయి, ఎంతవరకు పనులు అయ్యాయి అనే విషయాలు కనుక్కోవాలంటే కష్టమే. ఇటీవల రాష్ట్రంలో ఒక హౌసింగ్ కార్యాలయంలో దాదాపు 2 కోట్ల విలువచేసే స్టీల్ మాయం కావడంతో అధికారులను సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే హౌసింగ్ కార్యాలయంలో వివరాల కోసం వెళ్తే అధికారులు అందుబాటులో లేకపోవడం విశేషం.


Similar News