Nandyal Dist: సంగమేశ్వరుడిని చుట్టుముట్టిన కృష్ణమ్మ
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల అటవీ ప్రాంత పరిధిలో వెలసిన సప్తనదుల సంగమేశ్వర క్షేత్రాన్ని కృష్ణమ్మ ఆవరించింది..
దిశ, కర్నూలు ప్రతినిధి : నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల అటవీ ప్రాంత పరిధిలో వెలసిన సప్తనదుల సంగమేశ్వర క్షేత్రాన్ని కృష్ణమ్మ ఆవరించింది. శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 846.20 అడుగులకు నీటిమట్టం చేరింది. 860 అడుగులు చేరితే ఆలయం పూర్తిగా జల దిగ్బంధం కానుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణ పూర్ ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జూరాల నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో శ్రీశైలం జాలాశయ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.