Cm Jagan సెల్ఫ్ ఆపరేషన్ షురూ...తొలుత అక్కడి నుంచే..!

ఒకవైపు ఎన్నికలకు సమయం ముంచుకొస్తుంది. అంతే స్పీడుతో పార్టీలో అసమ్మతి తరుముకొస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగురవేశారు. మరికొందరు గోడమీద పిల్లిలా అవకాశం కోసం అదునుగా ఎదురుచూస్తున్నారు. ..

Update: 2023-02-09 15:43 GMT
  • ఆపరేషన్ మైలవరం
  • అసమ్మతిపై వైసీపీ ఫోకస్
  • నిన్న మంత్రి జోగి రమేశ్‌తో భేటీ
  • నేడు మైలవరం ఎమ్మెల్యే వసంతతో భేటీ
  • ఆపరేషన్ ఉదయగిరి సక్సెస్
  • మైలవరం ప్లస్ అయ్యేనా మైనస్ అయ్యేనా?

దిశ, డైనమిక్ బ్యూరో: ఒకవైపు ఎన్నికలకు సమయం ముంచుకొస్తుంది. అంతే స్పీడుతో పార్టీలో అసమ్మతి తరుముకొస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగురవేశారు. మరికొందరు గోడమీద పిల్లిలా అవకాశం కోసం అదునుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు సమీపించే సరికి అసంతృప్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలియడంతో హైకమాండ్ అలర్ట్ అయ్యింది. వైనాట్ 175 అనే దానికన్న ఉన్నవారిని కాపాడుకుని పార్టీలో అంతర్గత సమస్యలను చక్కదిద్దుకోవాలని వైసీపీ నాయకత్వం యోచన చేస్తుంది. ఆయా నియోజకవర్గాలలో అంతర్గత సమస్యలపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. నాయకుల మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు ఆనం మరోవైపు కోటంరెడ్డి పంచాయితీలతో వైసీపీ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. ఇకపై ఇలాంటి పంచాయితీలు రాకుండా ఉండేందుకు అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడింది.

సెల్ఫ్ ఆపరేషన్ షురూ...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. కొన్ని నియోజకవర్గాలలో నేతల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు పార్టీకి తలనొప్పిగా మారాయి.ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం పార్టీ అంతర్గత సమస్యలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ స్టార్ట్ చేసింది. మొదటగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేసింది. నియోజకవర్గం పరిశీలకుడిని మార్చి కొత్త పరిశీలకుడిని నియమించింది. దీంతో ఎమ్మెల్యే ధిక్కార స్వరానికి బ్రేక్‌లు వేసింది వైసీపీ నాయకత్వం. తాజాగా మైలవరం నియోజకవర్గం పంచాయితీపై ఫోకస్ పెట్టింది. మైలవరం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తుంది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్ వేలు పెడుతున్నారంటూ వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

జోగికి సీఎం జగన్ క్లాస్

రెండు వర్గాలకు సర్దిచెప్పడానికి చూసినప్పటికీ ఫలించలేదు సరికదా రెండు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్లారు.ఇదే విషయాన్ని నియోజకవర్గ పరిశీలకుడు మర్రి రాజశేఖర్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలకు ఏం జరుగుతుంది..పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలపై పూర్తి నివేదిక అందించారు. దీంతో హైకమాండ్ ఆపరేషన్ మైలవరంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా జోగి రమేశ్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి చర్చించారు. మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న రచ్చకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని ఆదేశించారట. మైలవరంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన సంకేతాలిచ్చారట. ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుని లేనిపోని వివాదాలకు తావివ్వొద్దని హెచ్చరించారట. ఇకపై అలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని సీఎం జగన్ హెచ్చరించినట్లు తెలిసింది.

టికెట్ వసంతకేనా?

మంత్రి జోగి రమేశ్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయిన మరుసటిరోజే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ సీఎంతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.నియోజకవర్గంలోని ఆధిపత్య పోరుపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు మంత్రి జోగి రమేశ్ నియోజకవర్గంలో జోక్యం చేసుకోరని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్‌నే పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అందర్నీ కలుపుకుని ముందుకు పోవాలని పార్టీకి చేటు తెచ్చే కార్యక్రమాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని సుతిమెత్తంగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మైలవరం ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. అటు పెడన నుంచి మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేయాలని జోగి రమేశ్ భావిస్తున్నారు. అసలే సొంత నియోజకవర్గం కావడంతో తన వర్గంతో రాజకీయం చేస్తున్నట్లు తెలుస్తోంది. మైలవరంలో వసంతని సైడ్ చేసి ఆ సీటు దక్కించుకోవాలని జోగి చూస్తున్నారు. ఇందులో భాగంగా మైలవరంలో వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు సందర్భాల్లో బట్టబయలైన సంగతి తెలిసిందే.

Also Read..

Yuvagalam: అడుగడుగునా అడ్డంకులు.. అయినా తగ్గని లోకేశ్ 

Tags:    

Similar News