Vijayawada: మైనింగ్ శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డికి రిమాండ్

మైనింగ్ శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది..

Update: 2024-09-27 13:15 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మైనింగ్ శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి(AP Mining Department Former MD Venkata Reddy)కి విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court) రిమాండ్ విధించింది. ప్రభుత్వ ఖజానాకు రూ. 2,566 కోట్లు నష్టం చేకూర్చారని ఆయనపై అభియోగం నమోదు అయింది. ఈ కేసులో అక్టోబర్ 10 వరకు వెంకటరెడ్డిని రిమాండ్‌కు పంపుతూ ధర్మాసనం ఆదేశించింది.

ఏపీ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని పోలీసులు హైదరాబాద్‌ (Hyderabad)లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఇసుక కాంట్రాక్టర్లకు సహకరించారని ఏసీబీ కేసు(Acb Case) నమోదు చేసింది. వెంకటరెడ్డి నిర్లక్ష్యం కారణంగా రూ.2,566 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. A1 నిందితుడిగా వెంకటరెడ్డిని చేర్చింది. కాగా అప్పటి మంత్రి పెద్దిరెడ్డికి వీరవిధేయుడిగా వెంకటరెడ్డి పని చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.


Similar News