Kodali Nani: ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది నేను, జూ.ఎన్టీఆర్
దివంగత నందమూరి తారకరామారావు సొంత గ్రామం నిమ్మకూరులో ఆయన శతజయంతి వేడుకలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ...
దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత నందమూరి తారకరామారావు సొంత గ్రామం నిమ్మకూరులో ఆయన శతజయంతి వేడుకలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభపై మాజీమంత్రి కొడాలి నాని తీవ్రంగా సెటైర్లు వేశారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహమైనా పెట్టావా..? చంద్రబాబు అని నిలదీశారు. గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. కనీసం నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు పెట్టలేకపోతే తాను, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి నిమ్మకూరు వచ్చి, ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంటే, శత జయంతి ఉత్సవాలు జరుపుతానంటుంటే.. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఎద్దేవా చేశారు. నందమూరి హరికృష్ణ ఎంపీగా ఉన్నప్పుడు రూ.14 కోట్లతో నిమ్మకూరును అభివృద్ధి చేశాడని తెలిపారు. ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరు మీద ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తులు కేవలం హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు మాత్రమేనని చెప్పారు. 42 ఏళ్ల తర్వాత అత్తారింటికి నిమ్మకూరు వచ్చి చంద్రబాబు బస్సులో నిద్రించాల్సిన పరిస్థితి వచ్చిందని...చంద్రబాబు నిద్రించడానికి నిమ్మకూరులో ఎవరూ ఇల్లు కూడా ఇవ్వలేదని, ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరులో చంద్రబాబుకు ఉన్న పరపతి అని మాజీమంత్రి కొడాలి నాని విమర్శించారు.
చంద్రబాబు పక్కన కమ్మవాళ్లే ఉండాలా?
దేశంలోనే రిచెస్ట్ సీఎం వైఎస్ జగన్ అంటూ చంద్రబాబు చేస్తున్న విమర్శలకు మాజీమంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. రెండెకరాల చంద్రబాబుకు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్..? తన భార్య ఆస్తులను చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. అఫిడవిట్ ప్రకారం భార్య ఆస్తులతో కలిపి చంద్రబాబు ఆస్తి విలువ రూ.668 కోట్లు అని ఆరోపించారు. క్రిస్టియన్లపై విమర్శలు చేసిన చంద్రబాబు...సిగ్గులేకుండా పాస్టర్లతో ఎలా మీటింగ్ పెట్టావ్ అని విమర్శించారు. చంద్రబాబు పక్కన కమ్మవారు తప్ప వేరొకరు ఉండకూడదా..? అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు బస్సుమీద ఉన్న ఆ నలుగురూ కమ్మోళ్లే . అది కమ్మవాళ్ళ కుల మీటింగ్ అవుతుంది తప్పితే.. ప్రజల మీటింగ్ ఎలా అవుతుందని నిలదీశారు. ‘జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ ఏమైపోయాడు..?..అచ్చెన్నాయుడు ఏమయ్యారు..?, మొన్న గెలిచిన ఎమ్మెల్సీ అనురాధ కూడా ఏమైపోయింది? గంటన్నరపాటు ఖాళీ కుర్చీలకు సొల్లు కబుర్లు చెప్పాడని కొడాలి నాని విమర్శించారు.
Also Read..