ప్రకాశం బ్యారేజీకి భారీ వరద.. గేట్లన్నీ ఎత్తేసిన అధికారులు

కృష్ణానదికి వరద తాకిడి పెరగడంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Update: 2024-10-20 10:30 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. ఇటీవల బుడమేరు సృష్టించిన వరద విలయం నుంచి బెజవాడ వాసులు ఇంకా తేరుకోకుండానే.. కృష్ణమ్మ పరుగులు పెడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. కృష్ణానదీ పరివాహక గ్రామాల ప్రజలు ఏ క్షణంలో వరద ముంచెత్తుతుందోనని భయం భయంగా గడుపుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తగా.. అధికారులు 70 గేట్లను ఎత్తి.. 1.18 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ గేట్లను ఎత్తడంతో.. కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు ప్రజలు ఘాట్ వద్దకు చేరుకుంటున్నారు. నదికి సమీపంగా ఎవరూ వెళ్లకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో.. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. 


Similar News