కేంద్రం అంబానీ ఖజానా నింపుతోంది: Cpm Leaders
ప్రతి ఇంటిలో ప్రధాని మోదీ సర్కార్ గ్యాస్ బాంబు పేల్చిందని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు....
దిశ, నెల్లూరు: ప్రతి ఇంటిలో ప్రధాని మోదీ సర్కార్ గ్యాస్ బాంబు పేల్చిందని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా విజయవాడలో నిరసన వ్యక్తం చేశారు. ఒక్కరోజులో వంట గ్యాస్ 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ 350 రూపాయలు పెంచిన ఘనత కేంద్రానిదేనన్నారు. 400 రూపాయల గ్యాస్ సిలిండర్‌ను 8 సంవత్సరాల్లో 1125 రూపాయలకు పెంచి సబ్సిడీకి కేంద్రం పూర్తిగా ఎగనామం పెట్టిందని విమర్శించారు. పేద ప్రజలపై ధరల భారాన్ని మోపి ప్రజల జేబులు కొడుతూ ఆదాని, అంబానీ కార్పొరేట్ల ఖజానా నింపుతోందని ఆరోపించారు. ప్రపంచంలో గ్యాస్, పెట్రోల్ రేట్లు తగ్గుతుండగా దేశంలో గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజలంతా వంట గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఎం నేతలు పిలుపునిచ్చారు.