Breaking: మైలవరం వైసీపీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. కొత్త ఇంచార్జిగా తిరుపతిరావు

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సీఎం జగన్ బిగ్ షాక్ ఇచ్చారు..

Update: 2024-02-02 12:50 GMT

దిశ, వెబ్ డెస్క్: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సీఎం జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. ఆ నియోజకవర్గం ఇంచార్జిగా శ్వర్నాల తిరుపతిరావును ఖరారు చేశారు. మైలవరం జెడ్పీటీసీగా ఉన్న తిరుపతిరావును ఈసారి ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేయించాలని సీఎం భావిస్తున్నారట. ఈ మేరకు సామాజిక వర్గాలుగా పలువురి పేర్లను పరిశీలించిన ఆయన  చివరకు తిరుపతిరావు వైపు మొగ్గు చూపారు.  దీంతో మైలవరం నుంచి బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన తిరుపతిరావును బరిలోకి దింపుతున్నట్లు ప్రతిపక్షాలకు సంకేతాలు పంపారు. 

కాగా గత ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందని వసంత కృష్ణ ప్రసాద్‌ను మైలవరం నుంచి పోటీ చేయించారు. టీడీపీ అభ్యర్థి, అప్పటి మంత్రి దేవినేని ఉమపై ఆయన గెలుపొందారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో నియోజకవర్గంలో చేయించిన సర్వేల్లో వసంత కృష్ణప్రసాద్‌పై వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం. దీంతో ఈసారి ఎన్నికల్లో సీటు ఇవ్వమనే సంకేతాలు ఇప్పటికే వసంత కృష్ణ ప్రసాద్‌కు వైసీపీ అధిష్టానం పంపిందంట. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారని నియోజకవర్గం కార్యకర్తలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మైలవరం నుంచి బీసీ అభ్యర్థి తిరుపతిరావుకు అవకాశం ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వర్గం నుంచి మద్దతు ఉంటుందో చూడాలి. 

Read More..

  జగన్ సిగ్గుతో తల దించుకోవాలి.. ఢిల్లీలో రెచ్చిపోయిన షర్మిల

Tags:    

Similar News