పోలవరం పూర్తిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కృష్ణా జిల్లా పామర్రులో చేపట్టిన ప్రజాగళం యాత్రలో పోలవరం పూర్తిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు..

Update: 2024-04-07 13:21 GMT

దిశ, వెబ్ డెస్క్: 2004లో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టుకు 2015లో జాతీయ హోదా వచ్చిన విషయం తెలిసిందే. అయితే 2014 తర్వాత టీడీపీ హయాంలో 70 శాతం వరకూ ప్రాజెక్టు పూర్తి అయిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందని విమర్శలు చేస్తు్న్నారు. అయితే వైసీపీ మాత్రం పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోవడానికి చంద్రబాబునే కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం రాజకీయ అంశంగా మారింది. దీంతో పోలవరం పూర్తి కాకపోవడంపై ప్రజాగళం యాత్రలో చంద్రబాబు ప్రస్తావిస్తూ వస్తున్నారు.

తాజాగా కృష్ణా జిల్లా పామర్రులో చేపట్టిన ప్రజాగళం యాత్రలో పోలవరం పూర్తిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. అదే తన చిరకాల కోరిక అని వ్యాఖ్యానించారు. తమ హయాంలో పోలవరం పనులు పరుగులు పెట్టాయన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయని విమర్శించారు. పోలవరం పూర్తి అయితే రాష్ట్రంలో ఎక్కడా కూడా సాగునీటిని ఇబ్బందులు ఉండవని చెప్పారు. రాష్ట్రంలో పేదలు లేకుండా చేయడమే తన ఆశయమన్నారు. పేదల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. బూతులు మాట్లాడే వారికే వైసీపీలో మంత్రులు పదవులు ఉంటాయన్నారు. రోడ్లపై ఉన్న గుంతలనే పూడ్చలేకపోయారని.. ఇంక మూడు రాజధానులు ఏమి కడతారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క హైదరాబాద్‌కు వలస పరిస్థితి నెలకొందని చెప్పారు. రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News