Kadambari Jatwani: కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామం.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

నటి కాదంబరీ జత్వానీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-09-05 05:53 GMT
Kadambari Jatwani: కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామం.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నటి కాదంబరీ జత్వానీ (Kadambari Jatwani) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు కేసులో నమోదు చేసిన నాటి నుంచి సేకరించి పూర్తి సాక్ష్యాధారాలను తదుపరి విచారణకు కొరకు భద్రపరచాలని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఏపీ హైకోర్టు (AP High court) కీలక ఆదేశాలు జారీ చేసింది. అనంతరం జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి (BVNL Chakravarthy) విచారణను ఈనెల 11కు వాయిదా వేశారు. కాగా, కాదంబరీ జత్వానీపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను నిందితురాలికి తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా ఆదేశించాలని కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టు విచారణ చేపట్టంది. కేసుపై ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ దాఖలు చేసిన రిక్వెస్ట్‌లో స్పష్టత లేదని అన్నారు. వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. ప్రస్తుతం అధికారులు అందరూ వరద సహాయక చర్యల్లో ఉన్నారని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సేకరించిన సాక్ష్యాధారాలు భద్రపరచాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేశారు. 


Similar News