మోడీ ఫొటో లేకపోవడానికి రీజన్ ఇదే.. TDP మేనిఫెస్టోపై జగన్ కీలక వ్యాఖ్యలు

టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమయ్య జిల్లా

Update: 2024-04-30 13:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమయ్య జిల్లా కలికిరి నియోజకవర్గంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కూటమి మేనిఫెస్టో విడుదలకు ముందు ఢిల్లీ నుండి బీజేపీ అధిష్ఠానం చంద్రబాబుకు ఫోన్‌ చేసింది.. మేనిఫెస్టోలో మీ ఫొటోలు పెట్టుకోండి, ప్రధాని మోడీ ఫొటోలు పెట్టొదని చెప్పారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలు మోసమని వాళ్లు గుర్తించారని.. అందుకే మేనిఫెస్టో కాపీలపై మోడీ ఫొటో పెట్టేందుకు బీజేపీ ఒప్పుకోలేదని అన్నారు. కూటమిలోని ముగ్గురి ఫొటోలు మేనిఫెస్టో కాపీలపై పెట్టుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.

మరోసారి సాధ్యం కానీ హామీలు, సాధ్యం కానీ మాటలతో సూపర్ సిక్స్ అంటున్నారు, సూపర్ సెవెన్ అంటున్నారు.. కూటమి మేనిఫెస్టోను మీరు నమ్ముతారా అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామంటున్నారు.. నమ్ముతారా అని క్వశ్చన్ చేశారు. 2014లో మోసం చేసిన విధంగానే ప్రజలను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు బరితెగించారు జగన్ నిప్పులు చెరిగారు. కాగా, టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇవాళ విడుదల చేశారు. సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ ఆరు ప్రధాన హామీలు ఇవ్వగా.. షణ్ముఖ వ్యుహాం పేరిట జనసేన ఓటర్లకు కీలక హామీలు ఇచ్చింది. 

Read More..

కూటమి మేనిఫెస్టో రిలీజ్..యువతకు ప్రత్యేక హామీలు! 

Tags:    

Similar News