చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయి: మాజీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయని జగన్ మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ..

Update: 2025-04-02 11:01 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) మోసాలు క్లైమాక్స్‌కు చేరాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి(Former Chief Minister Jagan Mohan Reddy) హెచ్చరించారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జరిగిన భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయకుడిలా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. హామీల విషయంలో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో అన్నీ అబద్ధాలు, మోసాలేనని విమర్శించారు. P4 అనే కొత్త మోసాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. హామీలపై ప్రశ్నిస్తే రాష్ట్రం అప్పుల పాలయ్యిందంటారన్నారు. హామీలు ఎగ్గొట్టడానికే అప్పులపై అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్న పదవి కోసం దారుణాలు చేశారని మండిపడ్డారు. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయన్నారు. భారీ మెజార్టీతో వైసీపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. కరోనా కారణంగా కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేదని చెప్పారు. కానీ జగన్‌ 2.O భిన్నమని, కార్యకర్తల కోసం నిలబడతామని జగన్ హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News