Gone Prakash Rao : అదానీ కేసులో జగన్ తప్పించుకోలేడు: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు
అదానీ ముడుపుల (Adani case) కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)తప్పించుకోలేడని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు(Gone Prakash Rao)జోస్యం చెప్పారు
దిశ, వెబ్ డెస్క్ : అదానీ ముడుపుల (Adani case) కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)తప్పించుకోలేడని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు(Gone Prakash Rao)జోస్యం చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరంజన్ రెడ్డి, కపిల్ సిబాల్, సిదార్థ్ లుద్రా, అభిషేక్ సింఘ్వి వంటి లాయర్లను పెట్టుకున్నా అమెరికా చట్టాల నుంచి తప్పించుకోవడం జగన్ వల్ల కాదన్నారు. రూ.1700కోట్లు కాదు..ఒక్క డాలర్ అయినా అమెరికా చట్టాలు వదిలిపెట్టబోవన్నారు. అమెరికా కేసులో తన పేరు లేదని జగన్ అనుకుంటున్నాడని, కాని అమెరికాకు విచారణకు జగన్ హాజరుకావాల్సిందేనన్నారు.
భారత్ లో మాదిరిగా అక్కడ కేసుల ఏళ్ల పాటు సాగవని, ఏడాది కాలంలో కేసులు తేలుతాయన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు సీబీఐని అడ్డుకున్నాప్పటికి ఇకమీదట ఆపలేరన్నారు. అమిత్ షా, లాలూ, జయలలిత, చిదంబరం వంటి వాళ్లే సీబీఐ నుంచి తప్పించుకోలేకపోయారని గుర్తు చేశారు. సీబీఐ విచారణను అడ్డుకోవడం వాళ్ల వల్లే కాదని, వాళ్లకంటే జగన్ ఏమైనా గొప్పవాడా..? అని ప్రకాష్ రావు ప్రశ్నించారు. జగన్ అవినీతి కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయాడన్నారు.