గూగుల్ విశాఖపట్నంకి వస్తే గేమ్ ఛేంజర్ అవుతుంది..చంద్రబాబు

విశాఖపట్నానికి గూగుల్ కంపెనీ (Google Company) వస్తుందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రకటించారు.

Update: 2024-12-11 10:55 GMT

దిశ, వెబ్ డెస్క్; విశాఖపట్నానికి గూగుల్ కంపెనీ (Google Company) వస్తుందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రకటించారు. బుధవారం సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ.. ఈ రోజు గూగుల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. ఐటీ పరిశ్రమల మంత్రి నారా లోకేష్ (IT Minister Nara Lokesh) కృషి వలనే విశాఖలో గూగుల్ కంపేనీ ఏర్పాటుకు ఎంఓయూ (MoU) చేసుకున్నామని సీయం చంద్రబాబు స్పష్టం చేశారు. గూగుల్ విశాఖపట్నంకి వస్తుందంటే అది గేమ్ చేంజర్ లా అవుతుందని అన్నారు. గూగుల్ కంపెనీ ఏర్పాటుతో 20 లక్షల మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించేలా కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఈ సదస్సులో గురువారంతో ముగయనుంది. 

Tags:    

Similar News