Heavy Rain: విజయవాడలో మళ్లీ మొదలైన వాన.. ఆందోళనలో ప్రజలు

విజయవాడలో మళ్లీ మొదలైన వాన..

Update: 2024-09-05 02:51 GMT
Heavy Rain: విజయవాడలో మళ్లీ మొదలైన వాన.. ఆందోళనలో ప్రజలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాలు వలన రెండు తెలుగు రాష్ట్రాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. వాటిలో ముఖ్యంగా విజయవాడ అయితే మరి.. తినడానికి తిండి .. ఉండటానికి గూడు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఈ రోజు ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో మళ్లీ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

ఇప్పటికే తగిలిన దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.. కానీ, మళ్లీ వరుణుడు తన ప్రతాపం చూపిస్తే సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. విజయవాడలో గత రాత్రి నుంచి పడుతున్న వానలతో వరదలు ఇంకా ఎక్కువయ్యి పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.

విజయవాడ ప్రజల్ని ఈ వాన ఇప్పట్లో వీడేలా లేదుగా.. ఇంకో వైపు ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద తాకిడి మళ్లీ పెరిగింది. ప్రస్తుతం 1.91 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉంది. ముఖ్యంగా వరద ప్రభావిత విజయవాడ, జగ్గయ్యపేట, పెనుగంచి ప్రోలు, నందిగామ, కంచికచర్ల, తిరువూరు, మైలవరం, ఇబ్రహీం పట్నం ప్రాంతాల్లో రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. బుడమేటి వరద ప్రస్తుతం తగ్గగా , ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉంది. ఈ కాల్వ మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. ఇందిరా గాంధీ స్టేడియం నుంచి వరద భాదితులకు ఆహారాన్ని అధికారులు అందజేస్తున్నారు.

Tags:    

Similar News