ఓటర్ల తుది జాబితాను సీఎంవో పర్యవేక్షించడం నిజమే.. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఘాటు వ్యాఖ్యలు

కేంద్ర ఎన్నికల కమిషన్‌ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-01-09 11:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎన్నికల తుది ఓటర్ల జాబితా వెల్లడించక ముంతే 95 శాతం బాగుందని విజయసాయిరెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయితే, రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్రియను సీఎంవో పర్యవేక్షిస్తుందని ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంకా తొలగించాల్సిన ఓట్లు 10 లక్షలకు పైగా ఉన్నాయంటూ తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, అందుకే తుది జాబితా విడుదలకు ఈసీ మరింత సమయం తీసుకుంటుందని కేశవ్ స్పష్టం చేశారు. అయితే, చనిపోయిన వారి పేర్లు ఇంకా ఓటరు జాబితాలో ప్రత్యక్షం అవ్వడం తాము ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

Tags:    

Similar News