ఐఆర్ఆర్ కేసు: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2023-11-29 10:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు నాయుడు తరఫున సీనియర్ న్యాయవాది నాగమత్తు తనవాదనలు వినిపించారు. బుధవారం సీఐడీ తరఫు న్యాయవాది ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. ఇరువాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది. ఇకపోతే చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి ఐఆర్‌ఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఐఆర్ఆర్ స్కాంలో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ ఆరోపించింది. ఈ కేసులో నిందితుల జాబితాలో చంద్రబాబు నాయుడు పేరును సైతం చేర్చింది. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్ మార్పు ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్ధతో పాటు మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ లబ్ది పొందారని సీఐడీ ఆరోపిస్తోంది.

Tags:    

Similar News