Breaking:ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి.

Update: 2025-04-12 05:27 GMT
Breaking:ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్డు తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరంతా ఎప్పుడెప్పుడా అని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు పరీక్ష ఫలితాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌https://resultsbie.ap.gov.in/ లో రిజల్ట్స్ చూడవచ్చు. అలాగే మిత్ర వాట్సాప్ నంబర్‌ 9552300009కు ‘hi’ అని మెసేజ్‌ పెట్టినా.. ఫలితాలు తెలుసుకోవచ్చు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే.

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలను విడుదల సందర్భంగా మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో కంటే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70% మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు 83% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs) లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69%గా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47%గా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు మరియు విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణం.

ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందకండి. దీనిని ఒక అడుగుగా భావించి, మరింత కృషి చేసి, మరింత బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు. మీరు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ, విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

ఫలితాల్లో ఆ జిల్లాదే పై చేయి..

జిల్లాల పరంగా చూసుకుంటే ఇంటర్​ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా టాప్​‌గా నిలిచింది. ఫస్టియర్​, సెకండియర్​ ఫలితాల్లో కూడా ఆ జిల్లాదే పై చేయి. ఇక ఈ ఫలితాల్లో 34శాతం ఉత్తీర్ణతతో విశాఖపట్నం జిల్లా వెనకబడింది. సెకండియర్​లోనూ పార్వతీపురం మన్యం జిల్లాలో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 55 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Tags:    

Similar News