AP Assembly:ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం..డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-23 13:06 GMT
AP Assembly:ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం..డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన దాడుల గురించి పవన్ ప్రసంగించారు. దాడులు చేసే వారిని చట్టాలు శిక్షిస్తాయని, వాళ్లు దాడి చేశారని మళ్లీ అదే దాడి మీరు చేస్తే అది చట్ట విరుద్ధం అని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గత ప్రభుత్వం చాలా మందిని ఇబ్బంది పెట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రస్తావన తీసుకొచ్చారు. వైసీపీ హయాంలో RRR ను కూడా బాగా ఇబ్బంది పెట్టారు. కానీ ఆయన చాలా పెద్ద మనసుతో నిన్న జరిగిన అసెంబ్లీలో జగన్‌ను మనసు విప్పి నవ్వుతూ పలకరించారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఈ క్రమంలోనే మీ నుంచి మేం నేర్చుకోవాలి..దాడి చేసినా, హాని తలపెట్టినా పట్టించుకోని మీ పెద్ద మనసుకు ధన్యవాదాలు అని పవన్ కళ్యాణ్ అనడంతో సభ్యులంతా నవ్వారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని వింటూ నవ్వులు పూయించారు. 

Read More..

AP Politics:‘వైసీపీ పాలన ఒక కేస్ స్టడీ’..సీఎం చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్! 

Tags:    

Similar News