జనసేనతో పొత్తుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాక్యలు చేశారు.

Update: 2023-08-29 11:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాక్యలు చేశారు. పరిస్థితులను బట్టి వచ్చే ఎన్నికల్లో పొత్తులపై నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. జనసేనతో సహా ఏ పార్టీతో పొత్తులపై ఇప్పుడే చెప్పలేనని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో సమయాన్ని బట్టే కీలక నిర్ణయాలుంటాయి అని చెప్పుకొచ్చారు. టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అంటూ చంద్రబాబు నాయుడు కీలక వ్యాక్యలు చేశారు.ఢిల్లీలో మంగళవారం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‍కు ఉన్న అతిపెద్ద సమస్య జగనే అని అన్నారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పుకొచ్చారు. టీడీపీ ఎప్పుడూ జాతీయభావంతో ఉండే పార్టీ అని జాతీయ రాజకీయాల్లో టీడీపీకి ప్రత్యేక అనుబంధం ఉంది అని చెప్పుకొచ్చారు.ప్రత్యేక హోదా కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా అనేది సెంటిమెంట్ అంశమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

జగన్‌ను గద్దె దించాలి

వైసీపీ నాయకులు తనపై భౌతిక దాడులు చేస్తున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రానికి ఉన్న పెద్ద సమస్య జగనేనని..రాష్ట్రం బాగుపడాలంటే జగన్‍ను గద్దెదించాలి అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విభజన గాయాల కంటే దారుణంగా రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారు అని చెప్పుకొచ్చారు. తన వయసును విమర్శించే వైసీపీ నేతలు ప్రధాని నరేంద్రమోడీ వయసు గురించి మాట్లాడే దమ్ము ఉందా అని నిలదీశారు. జగన్ విధానాలతో తెలంగాణకి, ఏపీకి పొంతన లేకుండా పోయిందన్నారు. ఏపీని జగన్ నాశనం చేశారని..మూడు రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేశారు అని మండిపడ్డారు. పోలవరం నిర్మాణం ఆగిపోయిందన్నారు. వైసీపీ అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నందుకే కేసులు పెడుతున్నారు అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ సొంత బాబాయ్‍ని చంపి తనపై నిందలు మోపారని గుర్తు చేశారు. మరోవైపు టీడీపీ గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఖాళీ అయిపోతుందని చెప్పుకొచ్చారు. మేం గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ టీడీపీగా మారుతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. 

Read More : తెలంగాణలో బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Tags:    

Similar News