AP News : ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. రిజల్ట్స్ భయమేనా?

ఏపీ(AP)లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

Update: 2025-04-11 15:15 GMT
AP News : ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. రిజల్ట్స్ భయమేనా?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరీక్షల ఫలితాల భయమో, ఏమో తెలియదు గాని.. ఓ ఇంటర్ విద్యార్థి సూసైడ్(Inter Student Suicide) చేసుకున్నాడు. నంద్యాల(Nandyala) జిల్లాలోని అయ్యవారి కోడూరుకి చెందిన బిజ్జం సుధీశ్వర్ రెడ్డి ఇటీవల ఇంటర్ ఫస్టియర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశాడు. రేపు(శనివారం) ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తామని ప్రభుత్వం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా తాను ఫెయిల్ అవుతానేమో, అలా అయితే అందరిలో చులకన అవుతాను, అమ్మానాన్న తల ఎత్తుకోలేరని భయపడిన సుధీర్ శుక్రవారం సాయంత్రం ఇంట్లోకి వెళ్ళి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా గది నుంచి ఎంతకీ బయటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూడగా.. అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల ఫలితాలు ముఖ్యం కాదని, జీవితం ముఖ్యమని.. ఎవరూ ఇలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకోకూడదని పోలీసులు విద్యార్థులకు తెలియజేస్తున్నారు.  

Tags:    

Similar News