బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. ఎన్ని లక్షల కోళ్లు మృతి చెందాయంటే?
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ వైరస్(Bird Flu Virus) కలకలం రేపింది.
దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ వైరస్(Bird Flu Virus) కలకలం రేపింది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ప్లూ వైరస్ కలకలం సృష్టించింది. తూర్పు గోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ తరుణంలో బర్డ్ ఫ్లూ భయం, అధికారుల హెచ్చరికలతో ఆయా జిల్లాల్లో చికెన్ రేటు దారుణంగా పడిపోయిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్(World Organization for Animal Health) నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభించినట్లు పారిస్‌కు చెందిన వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ స్పష్టం చేసింది. కోళ్ల ఫామ్స్‌తో పాటు ఇంట్లో పెంచుకునే కోళ్లకు సైతం ఈ వైరస్ సోకిందని వెల్లడించింది. రాష్ట్ర తూర్పు ప్రాంతాల్లో H5N1 ఎక్కువగా విస్తరించినట్లు పేర్కొంది. బర్డ్ ఫ్లూతో 6,02,000 కోళ్లు చనిపోయినట్లు పేర్కొంది. రీసెంట్‌గా ఉభయగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.