నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై హోంమంత్రి ప్రకటన

నిరుద్యోగులకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కీలక ప్రకటన చేశారు.

Update: 2024-08-12 10:56 GMT
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై హోంమంత్రి ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కీలక ప్రకటన చేశారు. సోమవారం రాజమండ్రి సెంట్రల్‌ జైలును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అతి త్వరలో రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించారు. అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం తాము గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గంజాయి సాగునుంచి గిరిజనులను దూరం చేసి.. అతి త్వరలోనే గంజాయి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేస్తామని అన్నారు.

అంతేకాదు.. కొవ్వూరు పోలీస్ స్టేషన్‌ను మోడ్రన్ స్టేషన్‌గా చేస్తామని అన్నారు. బ్లేడ్ బ్యాచ్‌పైనా నిఘా పెట్టినట్లు తెలిపారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపించడాన్ని ఆమె గుర్తుకు తెచ్చుకున్నారు. తమ నాయకుడిని 53 రోజులు అన్యాయంగా జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజులు గుర్తుకొచ్చి బాధగా అనిపిస్తుందని అన్నారు. వైసీపీ పాలనలో అక్రమ కేసులకు చంద్రబాబు కూడా బాధితుడిగా మారారని అన్నారు. అక్రమ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పాతాళానికి పడిపోయాయని తెలిపారు. వాళ్ల పాపాలు పండాయని.. అందుకే జన నాయకుడిని బాధపెట్టిన వైసీపీని పాతాళానికి తొక్కేలా ప్రజలు బలమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News