వాళ్లు జైలుకే.. శ్రీకాకుళం ఘటనపై హోంమంత్రి సీరియస్
ఆడబిడ్డలపై అబాండాలేసి వీధిన పెడితే..కచ్చితంగా జైలులో పెడతామని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు

దిశ, వెబ్ డెస్క్: ఆడబిడ్డలపై అబాండాలేసి వీధిన పెడితే..కచ్చితంగా జైలులో పెడతామని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minster Anitha) హెచ్చరించారు. శ్రీకాకుళం ఘటన(Srikakulam Incident)పై మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం(Telugu Desam Party Headquarters)లో ఆమె మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం డిగ్రీ యువతిపై భౌతిక దాడి కారణంగా స్పృహ తప్పి పడిపోయిందని తెలిపారు. అయితే ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ తప్పుడు సమాచారం ఇచ్చారని, వెంటనే సస్పెండ్ చేశామని చెప్పారు. కానీ సాక్షి మీడియా, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన(Former Deputy Chief Minister Dharmana), వైసీపీ నాయకులు లైంగికదాడి అంటూ నీచ ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు.
‘‘ఆడపిల్లలనే కనికరం లేకుండా వైఎస్ఆర్సీపీ(Ysrcp) నీచంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంతో రాజకీయం చేస్తున్నారు. యువతి, మహిళల మర్యాద, గౌరవాలను వీధిన పెట్టేందుకు తెగిస్తోంది. అమ్మాయిపై దాడి మాత్రమే జరిగిందని విచారణలోనూ నిర్ధారణ జరిగింది. నిజానిజాలు తేలకుండా ఓ ఆడబిడ్డపై విషప్రచారం చేయాల్సిన అవసరమేంటి?. మానవతా దృక్పథం కోల్పోయి రాక్షసంగా ప్రవర్తిస్తారా? ఆ కుటుంబం పరువు గురించి కనీసం ఆలోచించారా?. తల్లిదండ్రులు కూడా ఆ కోణంలో ఒక్క మాట మాట్లాడకపోయినా మీకెందుకు అంత కుట్రల ఆరాటం. నందిగామలో ప్రమాదాన్ని కూడా టీడీపీ కార్యకర్తల హత్యగా ఆరోపించడం హేయాతిహేయం. గతంలో పుంగనూరులో ఓ మైనర్ బాలిక హత్య ఘటనను కూడా రేప్‌గా చిత్రీకరించాలని తెగ ప్రయత్నించారు.’’ అని హోమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘వైసీపీ నేతల అబద్ధాల ట్వీట్‌లతో వాళ్ల కుటుంబాలు పడే వేదన తెలుసా? అని అనిత ప్రశ్నించారు. నిజంగా రేప్ జరిగితే కూటమి ప్రభుత్వం నిందితులను వదిలే ప్రసక్తే లేదన్నారు. గంటల్లో స్పందించి పోలీసులు రాజీపడకుండా అదుపులోకి తీసుకుని అరెస్ట్‌లు చేస్తున్నారని తెలిపారు. ‘‘ఇటీవల అనకాపల్లి హాకీ క్రీడాకారుడు ఓ యువతిపై అత్యాచారం చేస్తే అతన్ని అరెస్ట్ చేశాం. గత ఐదేళ్లలో జరిగిన అరాచకాలు, విధ్వంసాలు మరిచారా?. అరగంట అనేవాళ్లు మంత్రే.. గంటనేవాళ్లు కొత్త మంత్రివర్గంలో మంత్రే. కంత్రీ పనులు చేసి న్యూడ్ వీడియో కాల్స్ చేసినోళ్లు వైసీపీ మంత్రులు, ఎంపీలు. చివరి 20 రోజుల్లో ఘటనలంటూ వైసీపీ ట్వీట్లు చేస్తోంది. వైసీపీ అయిదేళ్ల పాలనలో అరాచకాలపై పుస్తకం వేస్తే..ఏం చర్యలు తీసుకున్నారు?. ’’ అని ఆమె ప్రశ్నించారు.
‘‘నిందితులకు వంతలు పాడి కాపాడడానికి ఇక్కడున్నది వైసీపీ ప్రభుత్వం కాదు. కూటమి ప్రభుత్వంలో 10 శాతం నేరాలు తగ్గాయి. ఎక్కడికక్కడ డ్రోన్లు, సీసీ కెమెరాలను విరివిరిగా వినియోగించి నేరరహిత సమాజం దిశగా అడువాళ్లు జైలుకే.. శ్రీకాకుళం ఘటనపై హోంమంత్రి సీరియస్గులేస్తున్నాం. నేరం జరిగిందా లేదా? తేల్చుకోకుండా మానవతా దృక్పథం మరచి ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలుంటాయ్. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారన్న విచక్షణ మరచిపోయి మృగాళ్ల ప్రవర్తించకండి. దిశ యాప్ పని చేస్తే, దిశ చట్టం నిజంగా ఉంటే గత ప్రభుత్వంలో ఆడబిడ్డల అన్ని అత్యాచారాలెలా జరిగాయి?. డిగ్రీ చదువుతున్న ఆడబిడ్డపై అత్యాచారమనే ప్రచారం వల్ల తర్వాత దుష్పరిణామాలకు బాధ్యులెవరు?. అత్యాచారం జరిగితేనే మీడియాలో పేర్లు రాయకూడదనే చట్టాలున్నా ఆ సున్నితమైన అంశాలు కనపడవా?. ప్రభావితమైన సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వినియోగించుకోండి. నిజమని తేలేలోపు అబద్ధం అవధులు లేకుండా తిరిగొస్తోంది. విచారణ చేసి చట్టపరంగా చర్యలు చేపడతాం. చిన్న ఆరోపణ చేస్తే గత వైసీపీ ప్రభుత్వం గౌతు శిరీషని సీఐడీ అరెస్ట్ చేసింది. ఆడపిల్లల రక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత. ఓ చిన్నారిపై అత్యాచారం నేపథ్యంలో ఫోక్సో కేసు పెట్టి 6 నెలల్లోనే 20 ఏళ్ల జైలు శిక్ష వేయించిన ప్రభుత్వం మాది.’’ అని వంగలపూడి అనిత పేర్కొన్నారు.