Herd of Elephants: మరోసారి ఏనుగుల మంద హల్‌చల్.. భారీగా కొబ్బరి తోట ధ్వంసం

రాష్ట్రంలో ఏనుగులు (Elephants) భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.

Update: 2024-11-03 04:11 GMT
Herd of Elephants: మరోసారి ఏనుగుల మంద హల్‌చల్.. భారీగా కొబ్బరి తోట ధ్వంసం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఏనుగులు (Elephants) భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆహారం కోసం అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి పొలాలు, తోటల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. అదేవిధంగా పొలం పనులు చేసుకుంటున్న రైతులపై దాడులకు తెగబడుతూ.. వారి ప్రాణాలను సైతం తీస్తున్నాయి. తాజాగా, విజయనగరం జిల్లా (Vizianagaram) పార్వతీపురంలో ఎనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. కారాడవలసలో కొబ్బరి తోటను గజరాజులు పూర్తిగా ధ్వంసం చేశాయి. అది చూసిన గ్రామస్థులు భయాందోళనలతో పరుగులు తీశారు. శనివారం సాయత్రం ఆటో, మిల్లర్‌ను గజరాజుల గుంపు బోల్తా కొట్టించాయి. రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను బంధించేందుకు ట్రాక్ చేస్తున్నారు. 

Tags:    

Similar News