బిగ్ అలర్ట్.. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవార్తనం(Surface) కాస్త.. అల్పపీడనం(low pressure)గా రూపాంతరం చెందింది.
దిశ, వెబ్‌డెస్క్: బంగాళఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవార్తనం(Surface) కాస్త.. అల్పపీడనం(low pressure)గా రూపాంతరం చెందింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Department of Meteorology) అలర్ట్(Alert) జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా పశ్చిమగోదావరి, వైఎస్సార్, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కృష్ణ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ వర్షాలు దంచికొడతాయిన అధికారులు తెలిపారు. అలాగే కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న చెరువులు, నదులు, రిజర్వయర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.