రేపు ఘనంగా వీర ఆరాధనోత్సవాలు
కారంపూడి ఉత్సాహంతో ఉప్పొంగుతోంది. వీర ఆరాధనోత్సవాలకు సిద్ధమవుతోంది.
దిశ, కారంపూడి: కారంపూడి ఉత్సాహంతో ఉప్పొంగుతోంది. వీర ఆరాధనోత్సవాలకు సిద్ధమవుతోంది. రేపటి నుంచి పల్నాటి వీరారాధనోత్సవాలు ఐదురోజులపాటు అట్టహాసంగా జరుగుతాయి. స్వస్థలానికి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరాచారులు వస్తారు. కారంపూడి పల్నాటి వీరారాధన ఉత్సవాలు శనివారం నుంచి ఐదు రోజుల పాటు రణక్షేత్రం కారంపూడిలో ప్రారంభం కానున్నాయి. క్రీ.శ.1182 లో జరిగిన పల్నాటి యుద్ధంలో అమరులైన వీరులను పల్నాటి వీరుల వారసులు వంశ పారంపర్యంగా ఏటా రణ క్షేత్రానికి తరలివచ్చి స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది వీరాచారులు తరలివచ్చి తమ ఆచారాలను పాటించనున్నారు. వీరుల ఆయుధాలు దైవాలుగా కొలుస్తూ గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. కత్తి సేవలు చేయనున్నారు.
వీర్ల అంకాలమ్మ తల్లి, చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పల్నాటి చరిత్రలో ముఖ్యమైన ఐదు చారిత్రక ఘట్టాల పేర్లతో ఐదు రోజుల పాటు ఉత్సవాలు వీరుల సంబరం, వీరుల గుడిలో కొలువైన పల్నాటి వీరుల ఆయుధాలు నాగులేరు ఒడ్డున ఉన్న పల్నాటి వీరుల గుడి జరగనున్నాయి. మొదటి రోజు 30 న రాచగావు, 1న రాయబారం, 2న మందపోరు, 3న కోడి పోరు ఉత్సవాలు జరగనున్నాయి. చివరి రోజు 4న కళ్లిపాడుతో ఉత్సవాలు ముగుస్తాయి.మొదటి రొజు రచగావు ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మ నంద రెడ్డి ఎడ్ల పందాలు ప్రారంభించడానికి వస్తున్నారు. అంకాలమ్మ తల్లి, చెన్నకేశవ స్వామికి పూజలు చేయనున్నారు. అనంతరం వీరుల గుడి తరలి వచ్చి పల్నాటి వీరులు ఆయుధాలకు పూజలు నిర్వహించనున్నారు.