AP News:కారంపూడి మండల ప్రజలకు ఆఫర్లపై సోలార్ విద్యుత్తు
కారంపూడి పట్టణ పరిధిలో శుక్రవారం విద్యుత్ సబ్ స్టేషన్ తనిఖీ చేసిన మాచర్ల విద్యుత్ డిఈ సింగయ్యా .
దిశ, కారంపూడి: కారంపూడి పట్టణ పరిధిలో శుక్రవారం విద్యుత్ సబ్ స్టేషన్ తనిఖీ చేసిన మాచర్ల విద్యుత్ డిఈ సింగయ్యా . అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలో 100 శాతం విద్యుత్ బకాయిలు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలంతా కేంద్రం రాయితీతో సోలార్ విద్యుత్తును వినియోగించుకోవాలి అని అన్నారు. ముఖ్యంగా రూ.200 వరకు ఎస్సీలకు సబ్సిడీ పై విద్యుత్ సరఫరా అవుతోంది. వీరందరికీ సోలార్ పలకలు వేయాలని నిర్ణయించాం. మరిన్ని వివరాలకు దగ్గర్లోని లైన్మెన్,మండల విద్యుత్ శాఖ అధికారిని సంప్రదించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ రామాంజనేయులు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.