చంద్రబాబు, పవన్‌పై మంత్రి నాగార్జున సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మంత్రి మేరుగ నాగార్జున సెటైర్లు వేశారు. ..

Update: 2023-12-24 14:30 GMT
చంద్రబాబు, పవన్‌పై మంత్రి నాగార్జున సెటైర్లు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మంత్రి మేరుగ నాగార్జున సెటైర్లు వేశారు. వైసీపీ అభ్యర్థులను మారుస్తున్నారని మాట్లాడుతున్నారని తమరు ఎక్కడ పుట్టి, ఎక్కడ పోటీ చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. అప్పులపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు విడ్డూరమని విమర్శించారు. చంద్రబాబు వద్ద ప్రైవేటు అప్పులు తీసుకుని తన సామాజిక వర్గాన్ని పవన్ కల్యాణ్ మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా టీడీపీ గెలవదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వచ్చే ఎన్నికల్లో  తుక్కుతుక్కుగా ఓడిపోతారన్నారు. చంద్రబాబు రథచక్రాలు విరిగిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడని గతంలో మాట్లాడారని, ఇప్పుడు ఆయనకెందుకు ఉద్యోగం ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా ఓట్లు మారుస్తారా అని మేరుగ నాగార్జున ప్రశ్నించారు. 

Tags:    

Similar News