AP:టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఆయన ప్రమేయం..ఆళ్ల ఎక్కడ?

మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆచూకీ తెలియకుండా ఉంది. పోలీసులు ఆయన కోసం వెతుకుతుండటంతో పారిపోయారని ప్రచారం మంగళగిరి ప్రాంతంలో జరుగుతోంది.

Update: 2024-07-11 02:33 GMT

దిశ ప్రతినిధి,గుంటూరు:మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆచూకీ తెలియకుండా ఉంది. పోలీసులు ఆయన కోసం వెతుకుతుండటంతో పారిపోయారని ప్రచారం మంగళగిరి ప్రాంతంలో జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి జరిగింది. ఆ దాడిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి శిష్య బృందం కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇందులో భాగంగా ఆళ్ళ ప్రధాన అనుచరుడు ఒకరిని అరెస్టు చేశారు. ఆ విచారణలో టీడీపీ కార్యాలయం పై జరగబోయే దాడి గురించి ముందుగా తెలుసు అన్న సమాచారాన్ని పోలీసులు నిర్ధారించుకున్నారు. వైసీపీ ప్రముఖులు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ అనుచరులతో పాటు ఆళ్ళ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ప్రధాన నాయకుల ముఖ్య అనుచర బృందంగా భావిస్తున్న 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇక ప్రధాన నాయకుల అరెస్ట్ పై పోలీసులు దృష్టి సారించడంతో వారంతా పరారీలో ఉన్నట్లు సమాచారం.


Similar News