Bapatla: హీరోయిన్ సమంతకు గుడి..28న ప్రారంభోత్సవం

అభిమానుల అభిమానానికి ఆకాశమే హద్దు అని అనేక సందర్భాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. తమ అభిమాన నటీనటులపై అభిమానులు చూపించే ప్రేమ, అభిమానం అనేక రూపాల్లో ఉంటుంది...

Update: 2023-04-26 17:23 GMT
Bapatla: హీరోయిన్ సమంతకు గుడి..28న ప్రారంభోత్సవం
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: అభిమానుల అభిమానానికి ఆకాశమే హద్దు అని అనేక సందర్భాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. తమ అభిమాన నటీనటులపై అభిమానులు చూపించే ప్రేమ, అభిమానం అనేక రూపాల్లో ఉంటుంది. ఇక తమిళనాడులో అయితే ఈ అభిమానం మరింత ఎక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తమ అభిమాన హీరో, హీరోయిన్లకు గుడికట్టి ఆరాధించడం తరచూ జరుగుతూనే ఉంటుంది. తమిళనాడులో ఇలా హీరోయిన్లకు గుడి కట్టించి ఆరాధించే సాంప్రదాయం ఎక్కువగా ఉంది ఇప్పటివరకు హన్సిక, కుష్బూ, నిధి అగర్వాల్, నమిత వంటి హీరోయిన్లకు తమిళనాడులో గుడులు కట్టి పూజలు చేస్తున్న సందర్భాలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి.తమ అభిమాన హీరోయిన్లను గుడి కట్టి ఆరాధించడం తమిళనాడులో ఎప్పటి నుంచో ఉంటే ఆ ట్రెండ్ ఇప్పుడు ఏపీలో కూడా మెుదలైంది. అందాల తార సమంతకు విపరీతమైన ప్రేక్షకాదరణ ఉన్న సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో సమంతకు ఎంత క్రేజీ ఉందో ఆమెను ఓ దేవతలా ఆరాధించే అభిమానులు సైతం ఉన్నారు. ఇలా సమంతపై ఉన్న అంతులేని అభిమానంతో ఓ వీరాభిమాని ఆమెకు గుడికట్టేస్తున్నాడు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్‌కు సమంత అంటే విపరీతమైన అభిమానం. ఆమెను ఓ దేవతగా ఆరాధిస్తుంటాడు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తుండటం తెలుసుకున్న సందీప్ ఆమెకు ఎలా కృతజ్ఞత చెప్పాలో అని ఆలోచన చేశాడు. అంతే ఆమెకు గుడి కట్టించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టిస్తున్నారు. నెలరోజులుగా సమంత గుడి నిర్మాణానికి పనులు చకాచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం విగ్రహానికి, గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఈనెల 28న సమంత పుట్టిన రోజు సందర్భంగా గుడిని ప్రారంభించనున్నట్లు సందీప్ తెలిపారు. ఈ విషయంలో ఇంకో విచిత్రం ఏంటంటే సమంతకు వీరాభిమాని అయిన తెనాలి సందీప్‌ ఇప్పటి వరకు సమంతను నేరుగా చూసింది లేదు.. కలిసింది లేదు. అయినప్పటికీ అంతులేని ప్రేమతో ఈ గుడి కట్టిస్తున్నాడు.

Tags:    

Similar News