Breaking: రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో సంచలన తీర్పు.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది..

Update: 2024-11-29 11:26 GMT

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(Guntur Nagarjuna University)లో 2015వ సంవత్సరంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి(Architecture Student Rishiteshwari) ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో సుసైడ్ లేఖ లభ్యం అయింది. ర్యాంగింగ్ వేధింపులతో తాను బలవన్మరణానికి పాల్పడుతానని లేఖలో రిషితేశ్వరి పేర్కొన్నారు. ఈ లేఖ ఆధారంగా పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో సుదీర్ఘకాలం విచారణ జరిగింది.దాదాపు 9 ఏళ్ల పాటు ఈ కేసులు విచారణ కొనసాగింది. అయితే సరైన సాక్షాలు లేని కారణంగా రిషితేశ్వరి ఆత్మహత్య కేసు(Suicide Case)ను శుక్రవారం గుంటూరు కోర్టు(Guntur Court) జడ్జి కొట్టివేశారు. దీంతో ఈ కేసు నిందితులకు ఊరట లభించింది.

అయితే రిషితేశ్వరి ఆత్మహత్య కేసును కోర్టు కొట్టివేయడంపై ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రిషితేశ్వరి రాసిన లేఖను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ కేసులో దాదాపు 170 మంది సాక్షులు ఉన్నారని తెలిపారు. న్యాయం కోసం పోరాటం చేస్తామని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తామని చెప్పారు. పైకోర్టులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేదని, ప్రభుత్వమే సాయం చేయాలని కోరారు. కేసులో న్యాయం జరగకపోతే మరణమే శరణ్యమని రిషితేశ్వరి తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Tags:    

Similar News