లోకేశ్ ఓ పప్పుగుత్తి.. తీవ్ర స్థాయిలో Kodali Nani ఆగ్రహం

పనికిమాలిన ముసలి సైకో చంద్రబాబు అని, ఆయన కడుపున పప్పుగుత్తి లోకేశ్ పుట్టాడని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

Update: 2023-02-04 16:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పనికిమాలిన ముసలి సైకో చంద్రబాబు అని, ఆయన కడుపున పప్పుగుత్తి లోకేశ్ పుట్టాడని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ ..సీఎం జగన్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నాడంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ రోజుకు కనీసం 10 కిలోమీటర్లు కూడా నడవలేకపోతున్నాడని విమర్శించారు. కనీసం లోకేశ్‌కు మాట్లాడటం కూడా చేతకావడం లేదని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబు తాను పాదయాత్ర చేయలేక కొడుకును రోడ్డు మీదకు వదిలాడని ఎద్దేవా చేశారు. జనం లేక లోకేశ్ ఖాళీ కుర్చీలకు స్పీచ్ ఇస్తున్నాడని విమర్శించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడే వైఎస్ వివేకాను హత్య చేయించాడని ధ్వజమెత్తారు. ఈ కేసు విచారణలో భాగంగా చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతల కాల్ డేటాపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎన్టీఆర్ వారసులు రాజకీయాల్లోకి వస్తుంటే గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయని, యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయని మాజీమంత్రి కొడాలి నాని సందేహం వెలబుచ్చారు.  


Similar News