Bapatla: అమర్‌నాథ్ హత్య వెనుక ఆ నేతలు.. సీపీఎం సంచలన ఆరోపణలు

బాపట్ల జిల్లాలో దారుణ హత్యకు గురైన విద్యార్ధి అమర్‌నాథ్ బాధిత కుటుంబాన్ని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి.రమాదేవి పరామర్శించారు....

Update: 2023-06-18 10:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బాపట్ల జిల్లాలో దారుణ హత్యకు గురైన విద్యార్ధి అమర్‌నాథ్ బాధిత కుటుంబాన్ని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి.రమాదేవి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తన సంతాపం తెలియజేశారు. ఆనంతరం డి.రమాదేవి మాట్లాడుతూ అమర్‌నాథ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసు త్వరితగతిన దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా పోలీసులు కృషి చేయాలని సూచించారు. అమర్‌నాథ్ కుటుంబానికి రూ.10 ఎక్స్ గ్రేషియా ఇస్తే సరిపోదని...ఆ కుటుంబ పోషణకు భూమి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డి.రమాదేవి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలకు రక్షణ లేదని, చాలా చోట్ల జరిగిన దాడులు, హత్యలు మానభంగాల వెనుక అధికార పార్టీ నేతలు అండదండలు ఉంటున్నాయని డి.రమాదేవి ఆరోపించారు. రాష్ర్టంలో బాధితులకి న్యాయం చేసేందుకు దిశ చట్టం తెచ్చామని, శిక్షలు వేస్తున్నామని...బాధితులను ఆదుకుంటున్నామని గొప్పలు చెప్పుకోవటం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. కేసును పాస్ట్ ట్రాక్ ద్వారా విచారణ పూర్తి చేయాలన్నారు. కేసు విషయంలో రాజకీయ ప్రమేయం లేకుండా దోషులకి శిక్షపడేలా చూడాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి.రమాదేవి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News