ఉపాధి హామీ కూలి వేతనాలు తక్షణమే చెల్లించాలి..వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

ఉపాధి హామీ పథకంలో బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2024-06-18 12:37 GMT

దిశ ప్రతినిధి, అమలాపురం: ఉపాధి హామీ పథకంలో బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పర్యటనలో భాగంగా ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక తదితర గ్రామాల్లో పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూలీల నుంచి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉపాధి హామీ వేతనాలు జిల్లా వ్యాప్తంగా బకా ఉన్నట్లు కూలీలు తెలిపారని తక్షణమే ఉపాధి హామీ వేతన బకాయిలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికిఉపాధి హామీ పథకంలో బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బడ్జెట్‌లో 2.5 లక్షల రూపాయల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. 200 రోజులు పనులు 600 రూపాయలు వేతనాలు పెంచాలని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు పనులు దొరకడం లేదని అన్ని సీజన్‌లో కూడా పనులు చెప్పే విధంగా అధికారులు పనులు గుర్తించి అనుమతులు తీసుకుని ఉపాధి కూలీలకు విరివిగా పనులు కల్పించే ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎవరైనా చనిపోతే ఉపాధి హామీ పథకంలో ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది కూలీలు ఈ వేసవిలో చనిపోయారని ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుందని తెలిపారు.

మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టారని మొదట ఆన్లైన్ పేరుతో తర్వాత నిధులు తగ్గించి ఇప్పుడు ఫోటోలు మస్తరుల పేరుతో కూలీలకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తక్షణమే ఉపాధి హామీ పథకాన్ని పటిష్ట పరిచే విధంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యల మీద పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కూలీల సమస్యల పరిష్కారం కోసం సంఘం ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఈ సందర్భంగా కూలీలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు పొలమూరు శ్రీనివాస్ మెట్టు, సుబ్రమణ్యం సుజాత తదితరులు పాల్గోన్నారు.


Similar News