ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు.. ఆర్డినెన్స్ జారీ

రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు అయ్యాయి....

Update: 2024-09-26 13:46 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపులు (Government Liquor Shops)రద్దు అయ్యాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రిటైల్ మద్యం షాపుల(Retail Liquor Stores)కు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. కాగా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మద్యం అమ్మకాలకు ప్రైవేటు రిటైల్ విధానాన్ని ప్రభుత్వం అనుసరించనుంది. ఈ మేరకు వేగంగా అడుగులు వేస్తోంది. వైఎస్ జగన్ (Ys Jagan) హయాంలో రాష్ట్రంలోని మద్యం షాపులన్నీ ప్రభుత్వం పరిధిలోనే కొనసాగాయి. మద్యం అమ్మకాలకు చెందిన లావాదేవీల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం పాత విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా కొత్త విధానాన్ని తీసుకురానుంది. రాష్ట్రంలో ఉన్న 3, 736 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో 340 మద్యం షాపులను కల్లుగీత కార్మికులకు కేటాయించనుంది.


Similar News