గుడ్ న్యూస్... ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు... అర్హతలు ఇవే...
ఏపీ గవర్నమెంట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ గవర్నమెంట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వేయి కళ్లతో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో నోటిషికేషన్ విడుదల చేసింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అస్టిస్టెంట్ ఎన్విరాన్‌మెంట్‌ల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్పీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 30, 2024 నుంచి ఫిబ్రవరి 19, 2024 లోపు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.
ఖాళీలు :
అస్టిసెంట్ ఎన్వీరాన్‌మెంట్ ఇంజనీర్ (ఎఈఈ) : 21
అర్హతలు:
డిగ్రీ సివిల్, మెకానికల్, కెమికల్, ఇన్విరాన్‌మెంట్‌ల్ ఇంజనీర్ విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
వయోపరిమితి:
18 సంవత్సరాల నుంచి 2024 జనవరి 7 కు 42 వయసు కలిగి ఉండాలి
దరఖాస్తు విధానం:
ఈ నెల 30 నుంచి ఫ్రిబవరి 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు కేవలం అప్లికేషన్ ఫీజు రూ. 250 చెల్లించాలి. వీరు ఎగ్జామ్ ఫీజు చెల్లించనవసరం లేదు. మిగిలినవారు అప్లికేషన్ ఫీజుతో పాటు రూ. 120 ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష తేదీ :
2024 ఏప్రిల్ లేదా మే లో ఉంటుంది( ఇంకా వెలువడలేదు)
ఎంపిక విధానం:
రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ద్వారా ఉంటుంది.
జీతం:
నెలకు రూ. 57,100 నుంచి రూ. 1, 47, 760.
మరిన్ని వివరాల కోసం https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు