తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. నేరుగా శ్రీవారిని దర్శించుకోవచ్చు

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.

Update: 2023-10-16 02:16 GMT

దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. పండగ సెలవులు మొదలైనా క్యూ లైన్లలో భక్తుల ఎక్కువమంది లేరు. అక్టోబర్ 14 ఉదయం నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్‌లోకి అనుమతిస్తున్నారు. కేవలం గంటలోనే స్వామివారి దర్శనం పూర్తవుతోంది. శ్రీవారిని 59,034మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు వచ్చాయని టీటీడీ తెలిపింది. అలాగే 22,391మంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాల వేళ సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 19వ తేదీ సాయంత్రం శ్రీవారి గరుడోత్సవాన్ని 6.30 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.

Tags:    

Similar News