బీఈడీ కాలేజీల యాజమాన్యాలకు శుభవార్త.. ఆ జీవో చెల్లదని చెప్పిన హైకోర్టు

బీఈడీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) కళాశాలల్లో తనిఖీలు చేయడానికి విద్యా హక్కు చట్టం సెక్షన్‌-31 ప్రకారం ఇచ్చిన ప్రభుత్వం జీవోను సవాలు చేస్తూ.. బీఈడీ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Update: 2024-01-12 14:16 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బీఈడీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) కళాశాలల్లో తనిఖీలు చేయడానికి విద్యా హక్కు చట్టం సెక్షన్‌-31 ప్రకారం ఇచ్చిన ప్రభుత్వం జీవోను సవాలు చేస్తూ.. బీఈడీ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఇరుపక్షాల వాగ్వాదాలను విన్న కోర్టు సెక్షన్‌-31 ప్రకారం ఉన్నత విద్యా మండలిని తనిఖీలు చేయడానికి నియమించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ జీవో చెల్లదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అంత అత్యవరం అయి విద్యా శాఖ తనిఖీలు చేయాలని భావిస్తే.. సెక్షన్‌-31 ప్రకారం ఎవరైనా ప్రత్యేక అధికారిని నియమించి, తనిఖీలు చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

Tags:    

Similar News