వెంకటేశ్వర స్వామి బంగారు ఆభరణాలకు బంగారు పూత

తిరుపతి గోవింద రాజ స్వామి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలో మకర తోరణానికి, పార్థ సారథి స్వామితో పాటు కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి బంగారు ఆభరణాలకు బంగారు పూతకు ఆమోదం పొందినట్టు టీటీడీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

Update: 2024-03-11 08:07 GMT

దిశ, తిరుమల :తిరుపతి గోవింద రాజ స్వామి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలో మకర తోరణానికి, పార్థ సారథి స్వామితో పాటు కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి బంగారు ఆభరణాలకు బంగారు పూతకు ఆమోదం పొందినట్టు టీటీడీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులతో కలిసి టిటిడి పాలకమండలి సమావేశాన్ని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహించి, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో రోజు రోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య దృష్టిలో ఉంచుకుని మరింత మేలైన,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను 479 నర్సింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం తీసుకోవడం జరిగిందన్నారు. టీటీడీ అన్ని కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థిని, విద్యార్థులు అందరికీ ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం అదనంగా నూతన హాస్టల్ భవనం నిర్మించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

టీటీడీలో 2014 ముందు చాలా మంది నోటిఫికేషన్ ROR ద్వారా కాకుండా, బోర్డు ఆమోదంతో పరిపాలన సౌలభ్యం కోసం కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగులను తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది అన్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, 2014 సంవత్సరాన్ని కటాఫ్ గా తీసుకుని నోటిఫికేషన్ ద్వారా ఎంపిక చేసిన వారందరినీ పర్మినెంట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం తెలిసిందే అన్నారు. దీంతో టీటీడీ లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ, నోటిఫికేషన్ ద్వారా కాకుండా,కోర్టు అనుమతి ద్వారా ఉద్యోగంలోకి వచ్చిన వారిని ప్రత్యేకంగా గుర్తించి, టీటీడీ ఉద్యోగులకు కూడా జీవో వర్తించేలా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు.

అదేవిధంగా రూ1.88 కోట్లతో పీఏసీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.రూ 1.50 కోట్లతో మిగిలిన ఔటర్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం,రూ.14 కోట్లతో ఉద్యోగస్తుల వసతి సముదాయాల అభివృద్ధికి ఆమోదం పొందినట్టు తెలిపారు.అదేవిధంగా టీటీడీ ఐటీ సేవల కోసం టెక్ రీప్లేస్మెంట్ కోసం ఐదేళ్ల పాటు నిర్వహణ కోసం రూ. 12 కోట్ల నిధులు కేటాయింపు కు ఆమోదం తెలిపామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల్లో అభివృద్ధి పనులకు ఆమోదం, ఘాట్ రోడ్డులో మరణించిన యతిరాజ నరసింహ కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా తరచూ విమానాల రాకపోకల విషయంలోనూ చైర్మన్ స్పందించారు. నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ఇచ్చే పరిస్థితి లేదని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తేల్చిందని భూముల కరుణాకర్ రెడ్డి తెలిపారు.


Similar News