రాజకీయాల్లోకి మరో నేత వారసులు.. గూడూరు అసెంబ్లీ నుంచి పోటీ..!
మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ కుమార్తె నీన త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చోయబోతున్నారు...
దిశ, తిరుపతి ప్రతినిధి: మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ అంటే తెలియని వారు లేరు..కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో మంత్రిగా ఆయన పని చేశారు. ఆసమయంలో రాష్ట్రం నుంచి చాలా కీలకంగా వ్యవహరించారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు. అయితే ఆయన కుమర్తె రాజకీయాల్లోకి అరంగేట్రం చేయబోతున్నారు. ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న చింతామోహన్ కుమార్తె నీన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. తండ్రి ఆశయాలు, అడుగు జాడల్లో నడిచి కాంగ్రెస్ పార్టీ తరపున గూడూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. చింతా మోహన్ నెల్లూరు వాసి కావడంతో గూడూరు నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.. అందులోనూ ఆయన హయాంలో దుగరాజపట్నం పోర్ట్ ఏర్పాటు చేయించారు. మన్నవరం, శ్రీసిటీ ఏర్పాటుకు చింతా ఎనలేని కృషి చేశారు..ఆయనకు ఉన్న మంచి పేరుతో ఈసారి ఆయన కుమార్తె నీన గూడూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.