‘సీఎం కాదు.. జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు’

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ దొంగ హామీలు ఇచ్చారని మండిపడ్డారు.

Update: 2024-02-17 05:52 GMT
‘సీఎం కాదు.. జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు’
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ దొంగ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. ప్రజలు నాలుగేళ్లు అధికారం ఇచ్చిన ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలవుతుందని అన్నారు. సీఎం పదవి కాదు కదా.. జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు.

నాలుగేళ్లు దోపిడీకే కేటాయించి.. అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన జగన్‌కు బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రపంచంలో జగన్ లాంటి నాయకుడు ఎక్కడా ఉండడని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పాలించిన సీఎం జగన్ ఒక్కడే అని ఎద్దేవా చేశారు. మరోవైపు పొత్తులపై త్వరలోనే క్లారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ వ్యహారాలన్నీ పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి చూసుకుంటారని అన్నారు. త్వరలో అభ్యర్థులను ప్రకటించి జనంలో వస్తామని చెప్పారు.

Read More..

ఉక్కిరిబిక్కిరవుతున్న CM జగన్.. ఓటమికి సంకేతాలతో దెబ్బతింటున్న ఆత్మస్థైర్యం 

Tags:    

Similar News