మాజీ ఎమ్మెల్యే దొమ్మేటికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Update: 2023-05-30 12:05 GMT

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి : దొమ్మేటి వెంకటేశ్వర్లు .. ఈ పేరు వినగానే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు అనేక పోరాటాలు గుర్తుకు వస్తాయి. దొమ్మేటి వస్తున్నారంటే చాలు అక్కడ ఏదో ప్రజా పోరాటం జరిగినట్లే.. అప్పటి అదికార పార్టీ నాయకులను చమటలు పట్టించినట్లే.. కేవలం 20 సంవత్సరాల వయస్సు నుంచే ప్రజా పోరాటాలకు అంకితమైన దొమ్మేటి అప్పటి తాళ్లరేవు నియోజకవర్గంలో మంచి నాయకుడుగా పేరు తెచ్చుకొ్న్నారు. బిసిల్లో మాస్ లీడర్ అని పించుకొన్నారు. ప్రతీ పేదవాడికి తోడు గా ఉంటూ వారి కష్టాల్లో పాలు పంచుకొనే వారు.. కేవలం 26 సంవత్సరాల వయస్సులో నే ఇతనికి గుర్తించిన కాంగ్రెస్ అదినేత్రి సోనియా గాందీ తాళ్లరేవు నియోజకవర్గం నకు సీటు ఇచ్చారు. చిన్న వయస్సులోనే కాంగ్రెస్ పార్టీలో సీటు సాదించిన వ్యక్తిగా గుర్త్తింపు పొందారు. తర్వాత ఓటమి పాలవ్వడంతో అదే యేడాది కాజులూరు మండల పరిషత్ నకు జరిగిన ప్రత్యక్ష్య ఎన్నికల్లో ఎంపీపీగా విజయం సాదించారు.

మూతీ మీద మీసం రాసి వయస్సులో దొమ్మేటి యంపీపీ అయ్యారు. తర్వాత మూడు పర్యాయాలు శాసన సభ్యునిగా శాసన సభ్యునిగా పోటీ చేసి , మూడొవ సారి స్వతంత్ర అభ్యర్దిగా అప్పటి మాజీ మంత్రి చిక్కా లరామచంద్రరావు మీద విజయం సాదించారు. నాడు టిడిపి కి కంచుకోట అయిన తాళ్లరేవు నియోజకవర్గంలో దొమ్మేటి విజయం సాదించి కంచు కోటకు బీటలు పడేలా చేశారు. అంతేగాక సుదీర్గ కాలం జిల్లా కాంగ్రెస్ అద్యక్ష్యునిగా సేవలందించారు. అంతటి నేత దొమ్మటి మ్రుతి ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ర మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల క్రుష్న సూచనల మేరకు అదికార లాంచనాలతో దొమ్మేటికి అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలకు మంత్రి వేణుతో బాటు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుబాస్ చంద్రబోసు, మాజీ ఎంపీ హర్షకుమార్, టిడిపి నుంచి మాజీ మంత్రి చిక్కా లరామచంద్రరావులు హజరయ్యారు..

కాంగ్రెస్ పార్టీతో సుదీర్గ అనుభవనం..

దొమ్మేటి వెంకటేశ్వర్లునకు కాంగ్రెస్ పార్టీతో సుదీర్గ అనుభవం ఉంది. తనకు ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి పార్టీలో సైనికుడిగా పనిచేసేవారు. దీంతో 25 వ యేటనే ఆయన పార్టీ సీటు పొందారు. తాళ్లరేవు నియోజకవర్గంలో పోటీ చేశారు. నాడు అప్నటి టిడిపి సిట్టింగ్ యంఎల్ఏ చిక్కా లరామచంద్రావు మీత ఓటమి పాలయ్యారు. అదే యేడాది జరిగిన మొట్టమొదటి మండల పరిషత్ ఎన్నికల్లో ప్రత్యక్ష్య పోటీలో పాల్గొన్నారు. నాడు టిడిపి అభ్యర్ది యాళ్ల క్రుష్నారావును ఓడించి యంపీపీ అయ్యారు. ఇలా కాజులూరు మండలానికి తొలి ఎంపీపీగా రికార్డు సాదించారు.

లక్ష్య సాధనలో అలుపెరగని నాయకుడు

ఆర్థకంగా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా సరే తాళ్లరేవు నియోజకవర్గానికి శాసన సభ్యులు కావాలన్నదే అతని లక్ష్యం. దీని కోసం దొమ్మేటి నిత్యం ప్రజల్లో నే ఉండేవారు. పోరాటాలు చేస్తూనే ఉండేవారు. భోజనం కూడా పూరి గుడెసెల్లో తన అనుయాయుల వద్ద తినే వారు. నిత్యం ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉండేవారు. పేదలకు వైద్య సేవలు అందించేవారు. 1986లో ఓటమి చెందిన తర్వాత 1999 లో మళ్లీ సీటు ఆశించారు. అియితే అదిష్టానం మెర్ల వీరయ్య చౌదరికి సీటు ఇవ్వడంతో అతని గెలుపుకు విశే ష క్రుషి చేశారు. కానీ విజయం వరించలేదు. 1994 లో పార్టీ మళ్లీ సీటు ఇచ్చించి కానీ ఈసారి కూడా పలితం లేదు. చివరికి 1999 ఎన్నికల్లో మళ్లీ సీటు అడిగారు కానీ పార్టీ వేరే వార్కి ఇచ్చింది. దీంతో దొమ్మేటి విమానం గుర్తు మీద స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేశారు. విజయం దగ్గరగా వచ్చి చేజారిపోయింది. 2004 లో దివంగత రాజశేఖర్ రెడ్డి సీటు ఇచ్చారు. బారీ మెజార్టీతో గెలిచారు. నాడు ఐదు పర్యాయాలు నుంచి గెలుస్తూ వస్తున్న చిక్కాలను ఓడించి రికార్డు సాధించారు.

జగన్ పాదయాత్రలో పార్టీలో చేరిక

కాంగ్రెస్ నుంచి వీడిపోయి జగన్ పాదయాత్ర సమయంలో వైసిపిలో చేరారు. రామచంద్రపురం సీటు ఆశించారు కానీ పలితం లేకపోవడంతో ఆయన జనసేన తీర్దం పుచ్చుకొన్నారు. అప్పటికే ఆరోగ్యం కాస్త నలతగా ఉండటంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.

సొంత గ్రామంలో కన్నీరు మున్నీరు..

దొమ్మే టి మ్రుతితో సొంతగ్రామమైన దుగ్గుదుర్రులో తన అబిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రతీ విషయంలోనూ తలలో నాలుకగా ఉండే దొమ్మేటి లేరనే విషయం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దొమ్మేటి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేసేవారు. తన కుమారుడు గీరీష్ కుమార్ గతంలో అకాల మరణం చెందారు. అతని పేరు మీద అనేక మందికి వివాహాలు, శ్రీమంతాలు చేయించేవారు. పేదలకు బట్టలు పంపిణీ చేసేవారు.

Also Read..

మహారాష్ట్ర ఏకైక కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత 

Tags:    

Similar News