అప్పుడు మమ్మల్ని అన్నారు.. ఇప్పుడు మీరేం చేశారు: పవన్‌కు రోజా కౌంటర్
ఏపీకి కేటాయించిన కేంద్ర బడ్జెట్ విషయంలో పవన్ కల్యాణ్‌ను మాజీ మంత్రి రోజా విమర్శించారు..

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం(Union Government)లో లోక్ సభ(Lokhsabha)లో బడ్జెట్(Budget) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా(Former minister Roja) విమర్శలు చేశారు. గత బడ్జెట్ సమయంలో వైసీపీ(Ycp) ఎంపీలపై విమర్శలు చేసిన పవన్ కల్యాణ్(Pawan Klayan) ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆమె నిలదీశారు. కేంద్ర బడ్జెట్‌పై అప్పుడు తమ ఎంపీలను అన్నారని, మరి ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏం చేసావ్..? అని రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘గతంలో రెండు కారం ముద్దలు తినండి, మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి’ అని పవన్ కల్యాణ్ అన్నారని రోజా గుర్తు చేశారు. అప్పట్లో ... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉందని, అయినా సరే ఎప్పటికప్పుడు వైసీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాలు చేశారని ఆమె తెలిపారు. పోలవరం(Polavaram), ప్రత్యేక హోదా(Special Catagiry), విశాఖ ఉక్కు(Visakha Steel), విభజన చట్టం అంశాలపై డిమాండ్ చేస్తూనే వచ్చామని చెప్పారు. అయితే ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ, జనసేన ఎంపీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఊత కర్రల సాయంతో నడుస్తుందని గుర్తుచేశారు. ఇప్పుడు అదే మాటలను ఏపీ ఎంపీలకు పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నారడని రోజా నిలదీశారు.
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు
పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్టుకు కేంద్ర బడ్జెట్లలో నిధులు కేటాయించారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు
పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు
విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు
రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు
రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు
లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్‌కు మద్దతుగా రూ.375 కోట్లు
రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు
ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు
గతంలో... వైసిపి ఎంపీలను ఉద్దేశించి పవన్ చెప్పిన మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం..
— Roja Selvamani (@RojaSelvamaniRK) February 1, 2025
రెండు కారం ముద్దలు తినండి , మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని @PawanKalyan అన్నారు.
అప్పట్లో ... కేంద్రంలో @BJP4India ప్రభుత్వం పూర్తి…