అధికారంలో ఉండగా అడ్డగోలు వ్యవహారాలు.. అడ్డంగా బుక్కైన జోగి రమేశ్..!
మాజీ మంత్రి జోగి రమేశ్ వివాదంలో చిక్కుకున్నారు. ..
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి జోగి రమేశ్ వివాదంలో చిక్కుకున్నారు. విజయవాడ రూరల్ నియోజకవర్గం అంబాపురంలోని అగ్రి గోల్డ్ భూమిని అక్రమంగా అమ్మేశారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. సర్వే నెంబర్ 87లోని 2160 గజాల అగ్రిగోల్డ్ భూములను 2018లో సీఐడీ అటాచ్ చేసింది. అయితే ఆ భూములను జోగి రమేశ్ కుమారుడు రాజీవ్, బంధువులు వెంకటేశ్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురి చేసి 87 సర్వేను 88గా మార్చి ఆ భూములను 300, 400 గజాల ప్లాట్లుగా చేసి ఇతరులకు అమ్మేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. అన్ని కోణాల్లో పత్రాలు పరిశీలించి యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం టీడీపీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడిన నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోననే చర్చ జరుగుతోంది