పోలవరం ప్రాజెక్టు మరింత ఆలస్యం.. మాజీ మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టు ఆలస్యంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు...

Update: 2024-09-16 07:03 GMT

దిశ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) ఆలస్యానికి గత ప్రభుత్వమే కారణమని సీఎం చంద్రబాబు (Cm Chandrababu), టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Former Minister Buggana Rajendranath Reddy) స్పందించారు. హైదరాబాద్ (Hyderabad) ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాలో మాట్లాడారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ(Telugu Desam Party Government)మేనని చెప్పారు. ‘‘పోలవరం ప్రాజెక్టుకు పునాది వేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి (Ys Rajasekhara Reddy). ఆయన హయాంలో అన్ని అనుమతులు తీసుకొచ్చారు. అనంతరం పోలవరం పనులు ప్రారంభించారు.’’ అని బుగ్గన గుర్తు చేశారు. 

కానీ పోలవరం పనులు తామే చేపట్టామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని బుగ్గన ఎద్దేవా చేశారు.  చిత్తశుద్ధి ఉంటే టీడీపీ (Tdp) హయాంలోనే పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.‘‘  కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. 2014 తర్వాత ఎన్డీయే ప్రభుత్వం (Nda Government)లో ఉన్న టీడీపీ పెద్ద పొరపాటు చేసింది. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ చట్టాన్ని పట్టించుకోలేదు. పునరావసంపై బాధితులకు స్పష్టత ఇవ్వలేదు. ఒక ఇరిగేషన్‌ను మాత్రమే ఆలోచించింది. 2013 చట్టాన్ని ఉల్లంఘించారు. రూ. 40 వేల కోట్లకు పైగా అవసరమున్న పోలవరాన్ని రూ. 20 వేల కోట్లకే ఒప్పుకున్నారు. అందువల్లే పోలవరం ప్రాజెక్టును టీడీపీ హయాంలో పూర్తి చేయలేకపోయారు. పోలవరం అంచనాలు పెరగడానికి కూడా తెలుగుదేశమే కారణం. విశాఖకు రావాల్సిన నీటి సరఫరాను పక్కకు పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విశాఖ గురించి ఆలోచించింది.’’ అని బుగ్గన పేర్కొన్నారు. 


Similar News