మాజీ సీఎం జగన్ ఢిల్లీ ధర్నా సినిమా సెట్టింగులా ఉంది: హోంమంత్రి అనిత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కూటమి పార్టీ అల్లర్లు సృష్టిస్తుందని.. మాజీ సీఎం జగన్ ఢిల్లీలో నిరసన చేపట్టారు.

Update: 2024-07-24 10:15 GMT
మాజీ సీఎం జగన్ ఢిల్లీ ధర్నా సినిమా సెట్టింగులా ఉంది: హోంమంత్రి అనిత
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కూటమి పార్టీ అల్లర్లు సృష్టిస్తుందని.. మాజీ సీఎం జగన్ ఢిల్లీలో నిరసన చేపట్టారు. జగన్ ధర్నాపై ఏపీ హోంశాఖ మంత్రి అనిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో హత్యలు జరగుతున్నాయనే అబద్దాలను ప్రచారం చేస్తూ.. జగన్ ఢిల్లీలో డ్రామా చేస్తున్నారన్నారు. వైసీపీ ఢిల్లీ ధర్నా మొత్తం సినిమా సెట్టింగులా ఉందని.. సాధారణ ప్రజలు నమ్మలేని విధంగా జగన్ ధర్నా ఉందన్నారు. అలాగే గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దాడులతో భ్రష్టుపట్టించిన వైసీపీ నేతలు ఇప్పుడు ఢిల్లీలో ధర్నాలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News