Floods: ప్రమాదకరంగా అప్పన్నపాలెం బ్రిడ్జి.. ఆరు గ్రామాలకు రాకపోకలు బంద్

ఎగువ నుంచి వస్తున్న వరదతో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం అప్పన్నపాలెం బ్రిడ్జి‌పై నుంచి వరద ప్రవాహం ప్రవహిస్తోంది. ..

Update: 2024-09-09 07:08 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎగువ నుంచి వస్తున్న వరదతో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం అప్పన్నపాలెం బ్రిడ్జి‌పై నుంచి వరద ప్రవాహం ప్రవహిస్తోంది. ఈ ఉధృతి మరింత పెరిగితే బ్రిడ్జి పూర్తి అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఈ రూట్‌లో వాహనరాకపోకలు నిలిపివేశారు. మొత్తం 6 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ఏలేళ్వరం వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో బ్రిడ్జి వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రెండు వైపులా రాకపోకలు నిలిపివేశారు.

అయితే రెండేళ్లుగా ఈ బ్రిడ్జి కుంగిపోయింది. అయినా ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడంతో చుట్టు తిరిగి దాదాపు 30 కిలో మీటర్లు ప్రయాణం చేసి ఏళేశ్వరం చేరుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

మరోవైపు రాజుపాలెం వద్ద ఏలేరు కాలువ ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. దీంతో కాలువకు గండి పడింది. దీంతో ఏలేరు రిజర్వాయర్ పరివాహక ప్రాంతానికి వరద నీరు చేరే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాసాలకు తరలిస్తున్నారు. 


Similar News