Breaking: వల్లూరుపాలెం కరకట్టపై ఉద్రిక్తత

వల్లూరుపాలెం కరకట్టపై రైతులు ఆందోళనకు దిగారు...

Update: 2024-12-05 11:49 GMT

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా వల్లూరుపాలెం కరకట్ట(Vallurapalem Karakatta)పై ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధాన్యం(Grain) సేకరణ విషయంలో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తోట్ల వల్లూరు ఎమ్మార్వో(Thotla Vallur Mro) నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. వల్లూరుపాలెం కరకట్ట రహదారిపై బైఠాయించారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే పోలీసులతో రైతులు(Farmers) వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేయాల్సింది పోయి, గోడు చెప్పుకుంటున్న తమను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News